Allu Arjun : వాట్.. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్.. రెమ్యునరేషన్ అంత భారీగా?

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ఇద్దరు దుబాయ్‌లో ఉన్నారు.

Allu Arjun will do Duel Role in Atlee Movie Rumors goes Viral

Allu Arjun : పాన్ ఇండియా మార్కెట్‌లో అల్లు అర్జున్.. అట్లీ కాంబినేషన్‌లో వచ్చే ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్‌ వార్తలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. పుష్ప-2తో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన బన్నీ, తన నెక్ట్స్ లెవెల్ కెరీర్ ప్లాన్‌లో భాగంగా అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

తొలుత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ కాస్త వెనక్కి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. అట్లీ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఆ మూవీ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.

Also Read : Veera Dheera Soora : విక్రమ్ ‘వీర ధీర శూర పార్ట్ 2’ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్ అదిరిందిగా..

అయితే డైరెక్టర్ అట్లీతో చేయబోయే సినిమాలో అల్లుఅర్జున్ రోల్‌పై ఇంట్రెస్టింగ్‌ న్యూస్ వైరల్ అవుతుంది. అట్లీతో చేసే సినిమాలో అల్లుఅర్జున్ డ్యుయల్‌ రోల్‌లో నటిస్తున్నాడని అంటున్నారు. హీరోగా, విలన్‌గా అతడే యాక్ట్ చేస్తాడని టాక్. నెగిటివ్ రోల్ అయితే నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చెబుతున్నారు. బన్నీ యాక్ట్ చేసే రెండు రోల్స్ చాలా పవర్ ఫుల్‌గా ఉంటాయంటున్నారు. నెగిటివ్ షేడ్స్‌లో అల్లుఅర్జున్ లుక్ ఓ రేంజ్ మాస్ లెవల్‌లో ఉంటుందని, ఈ రోల్‌ను ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారంటున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ ఇద్దరు దుబాయ్‌లో ఉన్నారు. అట్లీ.. బన్నీకి స్క్రిప్ట్ నరేషన్ ఇస్తున్నాడు. మరో రెండు వారాల దాక దుబాయ్‌లోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. దీంతో అల్లు అర్జున్ మొదటిసారి డ్యుయల్ రోల్‌ చేస్తున్నాడని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. అలాగే అట్లీ – బన్నీ కాంబినేషన్ సినిమాలో అల్లు అర్జున్ 175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని, అట్లీ కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడని సమాచారం.