Allu Arjun : భారీ బందోబస్తుతో.. మరి కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్..

విచారణకు అల్లు అర్జున్ భారీ బందోబస్తుతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కానున్నారు.విచారణకు అల్లు అర్జున్ భారీ బందోబస్తుతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కానున్నారు.

Allu Arjun will go to Chikkadapally PS with huge Security

Allu Arjun : సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్ పై బయటికి వచ్చిన అల్లు అర్జున్ కి తాజాగా మరోసారి విచారణకి రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఈ రోజు 11 గంటలకి అల్లు అర్జున్ విచారణకు హాజరు కానున్నారు. విచారణకి వెళ్లే సమయం దగ్గర పడడంతో అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విచారణకు అల్లు అర్జున్ భారీ బందోబస్తుతో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరు కానున్నారు. ఇక నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చాక తన లీగల్ టీమ్‌తో కూడా చర్చించాడు అల్లు అర్జున్. కాగా సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే వీడియోలు కూడా విడుదల చేశారు పోలీసులు. మరి విచారణలో ఎటువంటి నిజాలు బయటికొస్తాయో చూడాలి.

Also Read : Allu Arjun : మరోసారి సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్.. ఎందుకంటే..?

అయితే ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌ షో చూడడానికి అల్లు అర్జున్‌ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. రేవతి కుమారుడు శ్రీతేజ్‌ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు చెబుతున్నారు.