Allu Arjun wishes to David Warner on his Birthday
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్‌తో పాటు పలు లీగుల్లో మాత్రం ఆడతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎన్నో ఏళ్ల పాటు ఆడాడు. వార్నర్ నాయకత్వంలోనే ఓ సారి ఐపీఎల్ టైటిల్‌ను అందుకుంది ఎస్ఆర్‌హెచ్. ఇక ఫ్యాన్స్ అందరూ అతడిని ముద్దుగా వార్నర్ మామా పిలుస్తూ ఉంటారు. ఇక వార్నర్ సైతం తెలుగు వారిని తన సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తుంటానని పలు సందర్భాల్లో చెప్పాడు.
అంతేనా.. తెలుగు సినిమాలు అంటే వార్నర్‌కు తెగ ఇష్టం. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే వార్నర్‌కు ఎనలేని అభిమానం. వార్నర్ సోషల్ మీడియా చూస్తే చాలు.. పుష్పతో పాటు బన్నీ చిత్రాలకు చెందిన స్పూఫ్ వీడియోలే ఎక్కువగా దర్శనం ఇస్తాయి. ఇక సెంచరీ చేసినా, హాఫ్ సెంచరీతో అలరించిన ప్రతిసారీ వార్నర్ తగ్గేదేలే అన్నట్టుగా గడ్డం కిందకి చేయి పోనివ్వడాన్ని చూసే ఉంటాం. ఇక వార్నర్ వంటి వీరాభిమానుల పట్ల బన్నీ కూడా అంతే అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. ఇక వీరిద్దరు సందర్భాన్ని బట్టి ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు.
Renu Desai : రేణూ దేశాయ్ కి హెల్ప్ చేసిన రామ్ చరణ్ కుక్క పిల్ల
ఇక నేడు (అక్టోబర్ 27) డేవిడ్ వార్నర్ పట్టిన రోజు. ఈ సందర్భంగా వార్నర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు అల్లు అర్జున్. ‘నా సోదరుడికి పుట్టిన రోజు శుభాంక్షలు.’ అంటూ బన్నీ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
థ్యాంక్స్ బ్రదర్ అంటూ వార్నర్ కూడా రిప్లై ఇచ్చాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. పుష్ప కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
VenkyAnil3 : వెంకీ-అనిల్ రావిపూడి సినిమా నుంచి సూపర్ అప్‌డేట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?