VenkyAnil3 : వెంకీ-అనిల్ రావిపూడి సినిమా నుంచి సూప‌ర్ అప్‌డేట్.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ఎప్పుడంటే?

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు విక్ట‌రీ వెంక‌టేష్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు.

VenkyAnil3 : వెంకీ-అనిల్ రావిపూడి సినిమా నుంచి సూప‌ర్ అప్‌డేట్.. టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ ఎప్పుడంటే?

Venkatesh and Anil Ravipudi movie shooting 90 percent completed

Updated On : October 27, 2024 / 10:45 AM IST

VenkyAnil3 : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు విక్ట‌రీ వెంక‌టేష్ ఓ చిత్రంలో న‌టిస్తున్నారు. VenkyAnil3 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎఫ్‌-2, ఎఫ్‌-3 సినిమాలు మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దీంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేష్ లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. కామెడీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది.

Sheraz Mehdi : ఈ సినిమాకు హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే.. ఓ అందాల రాక్షసి అంటూ..

తాజాగా చిత్ర బృందం ఓ అప్‌డేట్ ను ఇచ్చింది. ఈ చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తి అయిన‌ట్లుగా వెల్ల‌డించింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు వేగంగా జ‌రుగుతున్న‌ట్లు తెలిపింది. త్వ‌ర‌లోనే టైటిల్‌, ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుక‌గా తీసుకొచ్చే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

Samudrudu : ‘సముద్రుడు’ మూవీ రివ్యూ.. సముద్రపు ఒడ్డున చేపల కోసం జరిగే పోరాటం..