Venkatesh and Anil Ravipudi movie shooting 90 percent completed
VenkyAnil3 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ఓ చిత్రంలో నటిస్తున్నారు. VenkyAnil3 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఎఫ్-2, ఎఫ్-3 సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
Sheraz Mehdi : ఈ సినిమాకు హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఒకరే.. ఓ అందాల రాక్షసి అంటూ..
తాజాగా చిత్ర బృందం ఓ అప్‌డేట్ ను ఇచ్చింది. ఈ చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తి అయినట్లుగా వెల్లడించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నట్లు తెలిపింది. త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా తీసుకొచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Samudrudu : ‘సముద్రుడు’ మూవీ రివ్యూ.. సముద్రపు ఒడ్డున చేపల కోసం జరిగే పోరాటం..
#SVC58 DUBBING BEGINS 🎙️
Team #VenkyAnil3 completed 90% of the shoot and post-production happening in full swing to entertain you all on the big screens 💥💥💥
TITLE & FIRST LOOK SOON ❤️🔥
Victory @VenkyMama @AnilRavipudi @Meenakshiioffl @aishu_dil #DilRaju #Shirish… pic.twitter.com/BnEn2lPu2P
— Sri Venkateswara Creations (@SVC_official) October 27, 2024