Samudrudu : ‘సముద్రుడు’ మూవీ రివ్యూ.. సముద్రపు ఒడ్డున చేపల కోసం జరిగే పోరాటం..

'సముద్రుడు' సినిమా సముద్ర తీరంలో ఉండే మత్స్యకారులకు, దళారులకు మధ్య జరిగే పోరాటాన్ని కమర్షియల్ గా చూపించే ప్రయత్నం చేసారు.

Samudrudu : ‘సముద్రుడు’ మూవీ రివ్యూ.. సముద్రపు ఒడ్డున చేపల కోసం జరిగే పోరాటం..

Samudrudu Movie Review and Rating

Updated On : December 18, 2024 / 2:32 PM IST

Samudrudu Movie Review : రమాకాంత్, అవంతిక, భానుశ్రీ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘సముద్రుడు’. కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్ పై నగేష్ నారదాసి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమన్, సమ్మెట గాంధీ, జబర్దస్త్ షేకింగ్ శేషు, చిత్రం శ్రీను, దిల్ రమేష్, సుమన్ శెట్టి.. పలువురు ముఖ్యపాత్రల్లో నటించారు. సముద్రుడు సినిమా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికొస్తే.. సముద్ర తీరంలో నివసించే ఓ గ్రామంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి దాని మీద జీవిస్తుంటారు. అయితే వాళ్ళు కష్టపడి పట్టుకొచ్చిన చేపలు దళారుల చేతికి వెళ్లి వీళ్లకు సరిగ్గా డబ్బు రావట్లేదని భావిస్తారు. దీంతో మత్స్యకారులు దళారులకు ఇవ్వకుండా వాళ్ళే సొంతంగా చేపలు అమ్ముకోవాలని డిసైడ్ అవుతారు. దీంతో దళారులకు, మత్స్యకారులకు ఘర్షణ ఏర్పడుతుంది. ఈ క్రమంలో మత్స్యకారుడు అయిన హీరో తన వాళ్ళ కోసం ఏం చేసాడు? ఆ ఊరికి టీచర్ గా వచ్చిన హీరోయిన్ మత్స్యకారుల కోసం ఏం చేసింది? పోలీసాఫీసర్ గా కొత్తగా ఆ ఊరికి వచ్చిన పాత్రలో సుమన్ ఏం చేసాడు? మత్స్యకారులు – దళారుల మధ్య ఘర్షణ ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : పుష్ప-2.. ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతుందా?

సినిమా విశ్లేషణ.. సముద్రపు ఒడ్డున ఉండే మత్స్యకారులు జీవితంతో ఈ సినిమాని తెరకెక్కించారు. మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళ కష్టాలు ఏంటి? దళారులు మత్స్యకారులను ఎలా మోసం చేస్తున్నారు వంటి అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించారు. లవ్ స్టోరీ సింపుల్ గా ఉంటుంది. హీరో తన వాళ్ళ కోసం ఏం చేసాడు అనే రెగ్యులర్ కమర్షియల్ పాయింట్ కి మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు.

నటీనటుల పర్ఫార్మెన్స్.. మత్స్యకారుడు పాత్రలో హీరోగా రమాకాంత్ బాగానే కష్టపడ్డాడు. టీచర్ పాత్రలో అవంతిక నటనతో పాటు అందాలతో అలరించింది. బిగ్ బాస్ భానుశ్రీ కొంచెం నెగిటివ్ పాత్రలో బాగానే మెప్పించింది. సీనియర్ హీరో సుమన్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించారు. సమ్మెట గాంధీ, చిత్రం శ్రీను, దిల్ రమేష్, షేకింగ్ శేషు, సుమన్ శెట్టి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పాటలు బాగానే ఉన్నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొని చోట్ల డైలాగ్స్ ని డామినేట్ చేసింది. కొన్ని చోట్ల డబ్బింగ్ పర్ఫెక్ట్ గా సింక్ అవ్వలేదు. సింపుల్ కథ, సింపుల్ స్క్రీన్ ప్లేతో ఓ కమర్షియల్ సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా చిన్న సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు నిర్మాతలు.

మొత్తంగా ‘సముద్రుడు’ సినిమా సముద్ర తీరంలో ఉండే మత్స్యకారులకు, దళారులకు మధ్య జరిగే పోరాటాన్ని కమర్షియల్ గా చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకు 1.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.