పుష్ప-2.. ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ముందుగానే చూపించేశారు.

Pushpa 2
పుష్ప-2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. పుష్ప-1 ఎఫెక్ట్‌తో పాటు పుష్ప-2పై మూవీ టీమ్ ఇస్తున్న హైప్‌తో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. డిసెంబర్ 5న వరల్డ్ వైజ్‌గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు. అయితే మూవీ సంబంధించి రోజుకో అప్డేట్ ఇంకా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
దర్శకుడు రాజమౌళికి..పుష్ప-2కు సంబంధించిన సీన్స్ చూపించాడట సుకుమార్. ఆ టేకింగ్, మూవీ సీన్లు చూసిన రాజమౌళి ఫిదా అయిపోయాడట. సుకుమార్ టేకింగ్, రైటింగ్‌ను రాజమౌళి బాగా ఇష్టపడతారు. ఈ విషయాన్ని ఆయనే చాలా వేదికలపై చెప్పారు కూడా. పుష్ప-1 షూటింగ్ జరుగుతున్నప్పుడు అందులోని కొన్ని సీన్లను సుకుమార్ ముందుగా రాజమౌళికి చూపించారు. అప్పుడు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని రాజమౌళినే సలహా ఇచ్చారని టాక్ వినిపించింది.
ఇప్పుడు పుష్ప-2 విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. పుష్ప-2 షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. మహేష్‌తో చేయబోతున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న రాజమౌళి..సరదాగా పుష్ప-2 షూటింగ్ స్పాట్‌కి వెళ్లాడట. అక్కడ పుష్ప-2లోని కొన్ని ఇంపార్టెంట్ సీన్లను సుకుమార్..రాజమౌళికి చూపించారట. ఆ సీన్స్ చూసి జక్కన్న బాగా ఇంప్రెస్ అయ్యారని టాక్. ఈ మూవీ పాన్ ఇండియాలో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కన్ఫామ్‌గా చెప్పాడట రాజమౌళి.
పుష్ప-2కు మొదటి ప్రేక్షకుడు రాజమౌళినే
ఆయన మాటలు విన్న సుకుమార్ ఫుల్ ఖుషీ అయ్యాడంటున్నారు. సినిమా పార్ట్-3 కూడా ఉంది కాబట్టి దానికి లీడ్ ఉండేలాగా రాజమౌళి కొన్ని సలహాలు కూడా ఇచ్చారట. డిసెంబర్ 5న పుష్ప-2 ప్రభంజనం సృష్టిస్తుందని రాజమౌళి చెప్పాడని అంటున్నారు. ఆ సమయంలో బన్నీ కూడా సెట్లోనే ఉన్నారట. అలా పుష్ప-2కు మొదటి ప్రేక్షకుడు రాజమౌళినే అయ్యాడు. పుష్ప-1 సూపర్ హిట్ అయ్యింది. అదే సెంటిమెంట్‌తో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ముందుగానే చూపించేశారు. ఈ సారీ కూడా ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని పుష్ప టీమ్ నమ్ముతోందట.
అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పుష్ప-2ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ వ్యయంతో నిర్మిస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. పుష్ప-2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11వేల 500 స్ర్కీన్స్‌ల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇండియాలో 6500 స్ర్కీన్స్, ఓవర్సీస్‌లో 5వేల స్ర్కీన్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు అంతా రెడీ చేస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇది బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ మూవీగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్ ఫిల్మ్ సర్కిల్స్.
చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు హగ్.. జానీ మాస్టర్ భావోద్వేగభరిత వ్యాఖ్యలు