చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు హగ్.. జానీ మాస్టర్ భావోద్వేగభరిత వ్యాఖ్యలు
శ్రేయోభిలాషుల ప్రార్థనల వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నానని చెప్పారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ బెయిల్ మీద జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఇంటికి వెళ్లిన ఆయనను కుటుంబ సభ్యులు కౌగిలించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను జానీ మాస్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు.
తాను 37 రోజుల్లో చాలా కోల్పోయానని, తన ఫ్యామిలీ, శ్రేయోభిలాషుల ప్రార్థనల వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నానని చెప్పారు. సత్యం అనేది ఏదోరోజు బయటపడుతుందన్నారు. తన కుటుంబం పడిన కష్టం, తనను ఎన్నటికీ వేదనకు గురి చేస్తూనే ఉంటుందని చెప్పారు.
కాగా, ఓ సహాయ నృత్య దర్శకురాలు జానీ మాస్టర్‌పై ఫిర్యాదుతో చేయడంతో ఆయన అరెస్టయి విచారణ నిమిత్తం చంచల్‌గూడ జైల్లో గడిపారు. నిన్న సాయంత్రం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. సెప్టెంబరు 19న ఆయనను గోవాలో అరెస్టు చేసి, చంచల్‌గూడ జైలుకు తీసుకొచ్చారు. తొలుత రంగారెడ్డి పోక్సో కోర్టులో ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు జరిపారు. మరో పిటిషన్ వేయడంతో చివరకు ఆయనకు బెయిల్ దక్కింది. నిన్న జైలు అధికారులు ఆయనను విడుదల చేశారు.
View this post on Instagram
చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారు- షర్మిలపై వరుదు కల్యాణి ఫైర్