చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారు- షర్మిలపై వరుదు కల్యాణి ఫైర్

వైఎస్ఆర్ వారసత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది.

చంద్రబాబుతో కలిసి కుట్రలు చేస్తున్నారు- షర్మిలపై వరుదు కల్యాణి ఫైర్

Varudu Kalyani Slams Ys Sharmila (Photo Credit : Google)

Updated On : October 26, 2024 / 8:13 PM IST

Varudu Kalyani : వైసీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపై ఫైర్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలను వరుదు కల్యాణి ఖండించారు. షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. షర్మిల మాటలు వైఎస్ఆర్ కుమార్తె మాటల్లా లేవని వరుదు కల్యాణి అన్నారు. షర్మిల.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా మాట్లాడుతున్నారని షర్మిలపై మండిపడ్డారు.

”సొంత అన్న అనే అనుబంధం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారు. షర్మిల మాటలు వింటుంటే ఈమె వైఎస్ఆర్ కుమార్తెనా అనేలా ఉంది. చంద్రబాబుతో కలిసి షర్మిల చేసే కుట్రలు చూసి.. స్వర్గంలో వైఎస్ఆర్ కూడా బాధపడతారు. షర్మిలలో అడుగడుగునా స్వార్థం కనిపిస్తుంది. చంద్రబాబు అడుగుజాడల్లో షర్మిల నడుస్తున్నారు. ఈడీ కేసుల్లో భారతి ఆస్తులు కూడా జప్తు చేశారు.

నాడు కేసుల్లో వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ పార్టీ పెట్టింది. నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా పోరాడి వైఎస్ఆర్ పేరును తొలగించారు. తప్పుడు మార్గంలో షేర్లు బదిలీ చేశారని జగన్ కోర్టుకు వెళ్ళారు. షర్మిల అండ్ కో చేసే కీడు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే జగన్ కోర్టుకు వెళ్లారు. జగన్ బెయిల్ రద్దు అయితే లక్షల కుటుంబాలు రోడ్డున పడేవి.

సొంత అన్న గురించి ఇంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారా? రక్తం పంచుకుని పుట్టిన అన్న గురించి ఇలా మాట్లాడటం దుర్మార్గం. మహిళలను గొప్పగా చూసే వ్యక్తి వైఎస్ జగన్. షర్మిల చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎవరూ నమ్మరు. వైఎస్ఆర్ పార్టీని భజాల మీద మోశాను అంటున్నారు. 2019లో మీ వల్లే అధికారంలోకి తీసుకొస్తే.. 2014లో ఎందుకు అధికారానికి దూరం అయ్యాం.

షర్మిల ఇలాంటి మాటలు మాట్లాడి చంద్రబాబు కనుసన్నల్లో నడవడం దుర్మాగం. వైఎస్ఆర్ వారసత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది. షర్మిల చంద్రబాబు కబంధ హస్తాల నుంచి బయటకు రావాలి” అని వరుదు కల్యాణి అన్నారు.

Also Read : ఆస్తులు భారతివైతే ఆమె కూడా జైలుకి వెళ్లాలి కదా? అంటూ జగన్‌పై షర్మిల సంచలన కామెంట్స్‌.. కంటతడి