హ్యాపీ బర్త్‌డే క్యూటీ.. భార్యకు బన్నీ విషెస్..

  • Publish Date - September 29, 2020 / 03:04 PM IST

Allu Arjun – Sneha Reddy: టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ కపుల్స్‌లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి జోడీ ఒకటి. 2011లో వివాహం చేసుకున్న వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు. తాజాగా జన్మదినోత్సవం జరుపుకున్న తన శ్రీమతి స్నేహకు బన్నీ సోషల్ మీడియా ద్వారా ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు తెలియచేశాడు స్టైలిష్ స్టార్.


‘నా జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే ఎన్నో బర్త్‌డేలను మనం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే క్యూటీ’.. అంటూ స్నేహా కేక్ కట్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ.