Allu Arjun Family : వాట్ ఎన్ ఐడియా.. అల్లు ఫ్యామిలీ అదుర్స్ అంతే..
స్టైలిష్ స్టాల్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. బన్నీ షూటింగ్ నుండి కాస్త గ్యాప్ దొరికితే చాలు పిల్లలతో కలిసి తాను కూడా ఓ కిడ్‌లా మారిపోయి సందడి చేస్తుంటారు..

Allu Arjuns Wife Sneha Reddy Shares Adorable Photoshoot Pic
Allu Arjun Family: స్టైలిష్ స్టాల్ అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. బన్నీ షూటింగ్ నుండి కాస్త గ్యాప్ దొరికితే చాలు పిల్లలతో కలిసి తాను కూడా ఓ కిడ్‌లా మారిపోయి సందడి చేస్తుంటారు.
View this post on Instagram
రీసెంట్‌గా ఫ్యామిలీతో కలిసి ఉన్న పిక్ ఒకటి షేర్ చేశారు స్నేహా.. ఈ ఫొటోలో బన్నీ, స్నేహా రెడ్డిల పరిచయం దగ్గరినుండి పిల్లలు పుట్టేవరకు మొత్తం వివరంగా చూపించడం హైలెట్.. ఫస్ట్ ఇమేజ్‌లో బన్నీ, స్నేహా ఉండగా.. రెండో ఫోటోలో అయాన్ చేరాడు. ముచ్చటగా మూడవదానిలో అర్హ కూడా యాడ్ అయింది. నాలుగో పిక్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నారు.
View this post on Instagram
ఈ బ్యూటిఫుల్ మెమరీస్ తాలుకు ఫొటోలన్నీ కూడా ఒకే లొకేషన్, ఒకే ప్రాపర్టీ (స్కూటర్) తో తీసుకోవడం మరో విశేషం.. క్యూట్ ఫ్యామిలీ, గ్రేట్ ఐడియా, అల్లు ఫ్యామిలీ అదుర్స్.. అంటూ బన్నీ ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. సినిమాల విషయానికొస్తే ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌తో ‘పుష్ప’ పాన్ ఇండియా చేస్తున్నారు అల్లు అర్జున్.. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ‘పుష్ప’రాజ్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ వదిలిన వీడియో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది..
View this post on Instagram