Site icon 10TV Telugu

Allu Arjun Grandmother : అల్లు కుటుంబంలో తీవ్ర విషాదం.. అల్లు అరవింద్ తల్లి కన్నుమూత!

Allu Arjun Grandmother

allu kanakaratnam passes away

Allu Arjun Grandmother : టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆమె శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉదయం 1.45 గంటల సమయంలో తుదిశ్వాసం విడిచారు.

కనకరత్నమ్మ కీర్తిశేషులు అల్లు రామలింగయ్య సతీమణి. ఉదయం 9గంటల సమయంలో కనకరత్నమ్మ పార్థివదేహాన్ని అల్లు అరవింద్ నివాసానికి తరలించనున్నారు. మధ్యాహ్నం తరువాత కోకాపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే, విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ ముంబై నుంచి హుటాహుటీన హైదరాబాద్ కు బయలుదేరారు.

మెగా కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ నివాసానికి చేరుకుంటున్నారు. కనకరత్నమ్మ (Allu Arjun Grandmother) మృతివార్తను తెలుసుకున్న పలువురు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. మరోవైపు.. అల్లు అరవింద్ నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: Kushboo Family Photo : ఫ్యామిలీ ఫిట్నెస్ గోల్స్.. కుష్బూ ఫ్యామిలీ అంతా ఒకేసారి వెయిట్ లాస్.. ఫొటో వైరల్..

Exit mobile version