Allu Ayaan : అమ్మమ్మ, తాతయ్యలతో అల్లు అయాన్.. నల్గొండలో తనయుడు అయాన్‌తో బన్నీ సందడి..

కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి అల్లుడు బన్నీని పిలవడంతో కంచర్ల కన్వెన్షన్ ని ఓపెన్ చేయడానికి అల్లు అర్జున్ తన మామ ఆహ్వానం మీద నేడు నల్గొండకు వెళ్లారు.

Allu Ayaan also went to Nalgonda for Allu Arjun Uncle Kancharla Convention center Opening Ceremony

Allu Ayaan :  ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. తాజాగా అల్లు అర్జున్ తన మామ కోసం నల్గొండ వెళ్ళాడు. అల్లు అర్జున్ భార్య స్నేహ(Sneha) వాళ్ళ నాన్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancharla Chandrashekar Reddy) ప్రస్తుతం బీఆర్ఎస్(BRS) తరపున రాజకీయాల్లో ఉన్నారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తాజాగా నల్గొండలోని పెద్దవూర మండలం కొత్తగూడెం గ్రామంలో ఓ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు.

కంచర్ల కన్వెన్షన్ సెంటర్ ప్రారంభోత్సవానికి అల్లుడు బన్నీని పిలవడంతో కంచర్ల కన్వెన్షన్ ని ఓపెన్ చేయడానికి అల్లు అర్జున్ తన మామ ఆహ్వానం మీద నేడు నల్గొండకు వెళ్లారు. అల్లు అర్జున్ ని చూడటానికి చుట్టుపక్కల నుంచి కూడా భారీగా అభిమానులు వచ్చారు. బన్నీకి భారీ బ్యానర్స్ తో వెల్కమ్ చెప్పారు. గజమాలతో అల్లు అర్జున్ కి స్వాగతం పలికారు అభిమానులు. కంచర్ల కన్వెన్షన్ ఓపెనింగ్ అనంతరం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు.

Allu Arjun : నల్గొండలో అల్లు అర్జున్ హంగామా.. అభిమానుల మధ్య ఐకాన్ స్టార్..

ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి బన్నీ తనయుడు అల్లు అయాన్ కూడా వచ్చాడు. అయితే అల్లు అయాన్ ముందే తన తాతయ్య – అమ్మమ్మల ఇంటికి వెళ్లి అటు నుంచి వారితో కలిసి వచ్చినట్టు తెలుస్తుంది. స్టేజి వద్ద అల్లు అయాన్ తాతయ్య అమ్మమ్మలతో కలిసి ఉన్నాడు. అల్లు అయాన్ చాలా సరదాగా అక్కడి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. స్టేజిపై అల్లు అయాన్ ని దగ్గరికి తీసుకొని అల్లు అర్జున్ మాట్లాడాడు. ఇక పలువురు అభిమానులు అల్లు అర్జున్ కి సన్మానం చేయగా కొంతమంది అయాన్ కి కూడా సన్మానం చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. బన్నీ అభిమానులు బన్నీతో పాటు అల్లు అయాన్ ని కూడా చూసి సంతోషించారు.