Site icon 10TV Telugu

Allu Ayaan : ఆమె మరణంతో.. బన్నీని పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న అల్లు అయాన్.. వీడియో వైరల్..

Allu Ayaan Crying after Allu Arjun Grand Mother Passed Away Video goes Viral

Allu Ayaan

Allu Ayaan : నేడు అల్లు అర్జున్ నానమ్మ, దివంగత అల్లు రామలింగయ్య భార్య కనకరత్నమ్మ మరణించారు. గ‌త కొన్నాళ్లుగా వృద్దాప్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆమె నేడు ఉదయం మరణించారు. ఆమె చిరంజీవి భార్య సురేఖకు తల్లి కూడా కావడంతో అల్లు, మెగా ఫ్యామిలీలు తీవ్ర విషాదంలో ఉన్నారు.(Allu Ayaan)

సినీ ప్రముఖులంతా అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి ఆమెకు నివాళులు అర్పించి అల్లు, మెగా కుటుంబాలను పరామర్శిస్తున్నారు. కొద్దీ సేపటి క్రితమే అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు ముగిసాయి. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అయాన్ లు పాడె మోశారు. అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు కోకాపేట్ లో ఉన్న అల్లు వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించారు.

Also See : Allu Arjun Ram Charan : చరణ్ కి అమ్మమ్మ.. బన్నీకి నానమ్మ.. ఆమె మరణంతో.. చాన్నాళ్లకు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటోలు వైరల్..

అయితే అల్లు కనకరత్నమ్మ మరణంతో బన్నీ తనయుడు అల్లు అయాన్ తండ్రిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. అల్లు అర్జున్ తనయుడిని ఓదారుస్తున్నాడు. దీంతో ఈ ఎమోషనల్ వీడియో వైరల్ గా మారింది. జేజమ్మతో అల్లు అయాన్ కి మంచి అనుబంధం ఉంటుందని, ఆమె మరణంతో అల్లు అయాన్ కూడా బాధపడుతున్నాడని ఈ వీడియో వైరల్ గా మారింది.

 

Also Read : Allu Aravind Mother : ముగిసిన అల్లు అరవింద్ తల్లి అంత్యక్రియలు.. ఎక్కడ చేసారంటే..

Exit mobile version