Ayan
Allu Ayan : స్టార్ హీరోల వారసులు కూడా సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తుంటారు. ఇప్పుడున్న చాలా మంది స్టార్ హీరోలు , హీరోయిన్స్ కూడా చిన్నప్పుడు తెరపై మెరిశారు. ఇప్పుడు అదే స్టార్ హీరోల పిల్లలు వెండితెరపై కనిపిస్తున్నారు. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరోల పిల్లలు సినిమాల్లోకి బాల నటులుగా ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి నెక్ట్స్ జనరేషన్ కూడా వెండితెర ఎంట్రీ ఇచ్చేశారు.
Balakrishna – Nani : న్యాచురల్ స్టార్ తో నటసింహం.. సెకండ్ ఎపిసోడ్ ఫ్యాన్స్ స్పెషల్
ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ ‘శాకుంతలం’ సినిమా ద్వారా తన డెబ్యూ ఇస్తుంది. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా ఇప్పుడు కొడుకు అల్లు అయాన్ కూడా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది. వరుణ్‌తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గని’ చిత్రం ద్వారా అయాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అని తెలుస్తుంది.
Telugu Cinema : ఈ వారం థియేటర్/ఓటిటిలో రాబోయే సినిమాలు ఇవే
ఇటీవల ‘గని’ సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కి అయాన్ చేసిన వర్కవుట్ వీడియోను గీతా ఆర్ట్స్ ఇవాళ ఉదయం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అల్లు అయాన్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. బన్నీలాగే ఎనర్జీ గా చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అయాన్ ఒక క్యారెక్టర్ లో మెరవనున్నాడని తెలుస్తుంది ఈ ట్వీట్ తో. మొత్తానికి అల్లు అర్జున్ తన పిల్లలని ఇప్పటినుంచే బాగా ప్రమోట్ చేస్తున్నాడు.
Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani??#AlluAyaanForGhani ?
▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H
— Geetha Arts (@GeethaArts) November 8, 2021