Balakrishna – Nani : న్యాచురల్ స్టార్ తో నటసింహం.. సెకండ్ ఎపిసోడ్ ఫ్యాన్స్ స్పెషల్

ఇందులో మోహన్ బాబు, బాలకృష్ణ మాట్లాడిన ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్

Balakrishna – Nani : న్యాచురల్ స్టార్ తో నటసింహం.. సెకండ్ ఎపిసోడ్ ఫ్యాన్స్ స్పెషల్

Nani Balayya

Balakrishna – Nani : ఇన్నాళ్లు వెండితెరపై తన నటన, డైలాగ్స్ తో సినిమాలు తీసి మెప్పించిన నందమూరి నటసింహం బాలయ్య ఇటీవల హోస్ట్ గా మారి యాంకరింగ్ తో కూడా అలరిస్తున్నారు. తెలుగు ఓటిటి ఆహాలో ‘అన్‌స్టాప‌బుల్ విత్ NBK’ అనే టాక్ షోతో ప్రేక్షకులకి మరింత ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నారు. ఇటీవలే ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది.

Telugu Cinema : ఈ వారం థియేటర్/ఓటిటిలో రాబోయే సినిమాలు ఇవే

మోహన్ బాబుతో జరిగిన ఫస్ట్ ఎపిసోడ్ ఎన్నో విశేషాలతో మన ముందుకి వచ్చింది. ఈ ఎపిసోడ్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇందులో మోహన్ బాబు, బాలకృష్ణ మాట్లాడిన ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ న్యాచురల్ స్టార్ నానితో రాబోతుంది.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ దశ దిన కర్మ.. అన్నదానాలు.. నేత్రదాన శిబిరాలు..

ఇప్పటికే నానితో సెకండ్ ఎపిసోడ్ షూట్ కంప్లీట్ అయిపొయింది. నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమకథ’ సినిమాలో బాలకృష్ణకి వీరాభిమానిగా కనిపిస్తాడు. ఆ సినిమాలో చేతిమీద జై బాలయ్య అని పచ్చబొట్టు కూడా వేయించినట్టు చూపిస్తారు. మరి ఒక అభిమానిని అభిమాన హీరో ఇంటర్వ్యూ చేస్తే ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు. అభిమానులకి పండగే. తాజాగా నానితో షూటింగ్ టైంలో బాలయ్య దిగిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని కూడా బాలకృష్ణకి ఫ్యాన్ గా నటించడంతో ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్ కి స్పెషల్ గా ఉండబోతుంది. నాని ఓ అభిమానిగా బాలయ్యను ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది. సెకండ్ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.