Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ దశ దిన కర్మ.. అన్నదానాలు.. నేత్రదాన శిబిరాలు..

పునీత్ రాజ్‌కుమార్ దశ దిన కర్మకాండ ఇవాళ జరగనుంది. దీని కోసం వారి కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పునీత్ కుటుంబసభ్యులు వారి స్వగృహంతో పాటు కంఠీరవ స్టూడియోలో

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్ దశ దిన కర్మ.. అన్నదానాలు.. నేత్రదాన శిబిరాలు..

Puneeth (1)

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి నేటికి 11 రోజులు కావొస్తుంది. ఇప్పటికి ఆయన అభిమానులు మాత్రమే కాక కన్నడ ప్రజలు కూడా ఈ విషయాన్నీ జీర్ణించుకోలేకపోతున్నారు. కంఠీరవ స్టూడియోలో ఉన్న పునీత్ సమాధిని దర్శించటానికి ఇవాళ్టి వరకు కూడా వేలల్లో అభిమానులు, ప్రజలు తరలి వస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో రద్దీ బాగా పెరిగింది. పోలీసుల బందోబస్త్ ని కూడా పెంచారు పునీత్ సమాధి వద్ద.

Akhanda : హాట్ స్టార్ ఓటిటిలో అఖండ.. ఎప్పటి నుంచి ??

పునీత్ రాజ్‌కుమార్ దశ దిన కర్మకాండ ఇవాళ జరగనుంది. దీని కోసం వారి కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. పునీత్ కుటుంబసభ్యులు వారి స్వగృహంతో పాటు కంఠీరవ స్టూడియోలో పునీత్ సమాధి వద్ద కార్యక్రమాలను చేయనున్నట్టు తెలిపారు. పునీత్ దశ‌ దిన కర్మకాండ సందర్భంగా వారి కుటుంబం స్టూడియోలో అన్నదానం నిర్వహించనుంది. కేవలం కుటుంబ సభ్యులే కాక పునీత్ అభిమానులుకూడా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో పునీత్ పేరిట ఇవాళ అన్నదానం నిర్వహించనున్నారు.

Degala Babji : బండ్ల గణేష్ విశ్వ రూపం.. డేగల బాబ్జి ట్రైలర్ విడుదల

ఇక మరణించాక పునీత్‌ రాజ్‌కుమార్ నేత్రదానం చేసి మరో ఇద్దరికి చూపుని ప్రసాదించాడు. పునీత్ నేత్రదానంతో స్ఫూర్తి పొందిన అభిమానులు, ప్రజలు తమ మరణానంతరం నేత్రాలను దానం చేస్తామంటూ ముందుకొస్తున్నారు. ఇవాళ పునీత్ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు నేత్రదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు.