Akhanda : హాట్ స్టార్ ఓటిటిలో అఖండ.. ఎప్పటి నుంచి ??

తాజాగా ఈ సినిమాపై మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ భారీ

Akhanda : హాట్ స్టార్ ఓటిటిలో అఖండ.. ఎప్పటి నుంచి ??

Akhanda

Akhanda :  నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న మూడో సినిమా అఖండ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమాలో బాలయ్య బాబు లుక్ చాలా కొత్తగా, గంభీరంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రోస్డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Degala Babji : బండ్ల గణేష్ విశ్వ రూపం.. డేగల బాబ్జి ట్రైలర్ విడుదల

ఈ సినిమాని సంక్రాంతికి తీసుకొద్దాము అనుకున్నారు కానీ అప్పటికే ఇంకొన్ని పెద్ద సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడంతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు కానీ ఫిబ్రవరిలో లేదా మార్చి లో రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Balakrishna : మాట నిలబెట్టుకున్న బాలయ్య.. క్యాన్సర్ పేషంట్ కి ఉచిత వైద్యం

తాజాగా ఈ సినిమాపై మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. ఈ సినిమా థియేటర్‌లో విడుదలైన 50 రోజులకు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ విషయంలో అధికారికంగా అప్ డేట్ రావాల్సి ఉంది.