Degala Babji : బండ్ల గణేష్ విశ్వ రూపం.. డేగల బాబ్జి ట్రైలర్ విడుదల

ఈ సినిమాని తెలుగులో బండ్లగణేష్ మెయిన్ లీడ్ గా డేగల బాబ్జి పేరుతో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఇవాళ ఉదయం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

Degala Babji : బండ్ల గణేష్ విశ్వ రూపం.. డేగల బాబ్జి ట్రైలర్ విడుదల

Degala Babji

Degala Babji : బండ్ల గణేశ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో బాగా పాపులర్ అయ్యాడు. కమెడియన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించాడు. ఇక పవన్ కళ్యాణ్ తన దేవుడు అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బండ్లన్న మాట్లాడే స్పీచ్ లతో బాగా వైరల్ అయ్యాడు. దీంతో బండ్ల గణేష్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమాలు చేయను అని చెప్తూనే సినిమాలు చేస్తున్నాడు బండ్ల గణేష్. ప్రస్తుతం బండ్ల గణేశ్ హీరోగా ఓ డిఫరెంట్ స్టోరీతో ‘డేగల బాబ్జి’ అనే సినిమా చేయబోతున్నాడు.

Balakrishna : మాట నిలబెట్టుకున్న బాలయ్య.. క్యాన్సర్ పేషంట్ కి ఉచిత వైద్యం

తమిళ్‌లో ఆర్. పార్థిబన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ సినిమా ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’ కి‌ రీమేక్ ఇది. ఈ సినిమాకు గాను పార్థిబన్ కు జాతీయ పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో బండ్లగణేష్ మెయిన్ లీడ్ గా డేగల బాబ్జి పేరుతో రీమేక్ చేస్తున్నారు. తాజాగా ఇవాళ ఉదయం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

Telugu Cinema : తెలుగు సినీ పరిశ్రమలో మరో ఎన్నికల యుద్దం.. మొదలైన వివాదాలు

ఈ ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ఈ సినిమాని ఒకే లొకేషన్ లో తీస్తున్నట్టు తెలిపారు. ఈ సినిమా మొత్తం ఒకటే క్యారెక్టర్ ఉండబోతుంది. అది బండ్ల గణేష్ ఒక్కడే. ఒక్క ఆర్టిస్ట్ వివిధ రకాల క్యారెక్టర్స్ గా నటించనున్నాడు. ట్రైలర్ లో బండ్లగణేష్ నటన చూసి ఆశ్చర్యపోతున్నారు అంతా. బండ్ల గణేష్ ని ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ లో చూడలేదు. మొదటి సారి బండ్లన్న తన నట విశ్వ రూపం చూపించాడని తెలుస్తుంది. బండ్ల గణేష్ లో ఉన్న వేరియేషన్స్ అన్నీ ఈ ఒక్క సినిమాలోనే చూపించబోతున్నాడు అని అర్ధమవుతుంది. ఈ ట్రైలర్ తో డేగల బాబ్జి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

Manas – Priyanaka : మానస్, ప్రియంకల పెళ్ళికి ఒప్పుకోను : మానస్ తల్లి

తమిళ్ లో ఈ సినిమాకు, ఆ ఆర్టిస్ట్ కు చాలా అవార్డులు వచ్చాయి. మరి బండ్లన్న ఎన్ని అవార్డులు సంపాదిస్తాడో చూడాలి ఈ సినిమాతో. త్వరలో ఈ సినిమా రానుంది.