Manas – Priyanaka : మానస్, ప్రియంకల పెళ్ళికి ఒప్పుకోను : మానస్ తల్లి

హౌస్‌లో మానస్‌కు ఎవరూ సెట్‌ కారు. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్‌ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. కావాలంటే ఆమెకు

Manas – Priyanaka : మానస్, ప్రియంకల పెళ్ళికి ఒప్పుకోను : మానస్ తల్లి

Vishwa (1)

Manas – Priyanaka :  ప్రతి సంవత్సరం బిగ్ బాస్ సీజన్ లో లవ్ ట్రాక్స్ చాలా ఉంటాయి. కానీ ఈ సీజన్ మొత్తం ఒకటే లవ్ ట్రాక్ సాగుతుంది. అదే మానస్ ప్రియాంక ల స్టోరీ. బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ని నడిపిస్తున్నాడు బిగ్ బాస్. ప్రియాంక అయితే మానస్ చుట్టూనే తిరుగుతుంది. మానస్ కోసం ఏదైనా చేస్తాను అంటూ, మానస్ కి గేమ్స్ లో సపోర్ట్ చేస్తూ, మానస్ ని కలవరిస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా సార్లు ప్రియాంక మానస్ కి ఐలవ్యూ చెప్పింది. మానస్ మాత్రం ఈ ట్రాక్ ని అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. ఏదో హౌస్ లో ఉన్నాము తప్పదు అన్నట్టు ప్రియాంకతో క్లోజ్ గా మాట్లాడుతున్నాడని షో చూసే అందరికి అర్థమైపోతుంది. బిగ్ బాస్ తర్వాత ఎవరి దారి వాళ్లదే అని ఇద్దరికీ తెలుసు అయినా ప్రియాంక మానస్ విషయంలో చాలా ఎమోషనల్ అవుతుంది.

Bigg Boss 5 : బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే : విశ్వ

తాజాగా మానస్ తల్లి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడింది. మానస్ తల్లి పద్మిని నాగులపల్లి కూడా సినిమా ఇండస్ట్రీనే. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్, సెన్సార్ బోర్డు మెంబర్ గా కూడా వర్క్ చేశారు. మానస్‌ తల్లి పద్మిని వీళ్లిద్దరి లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ.. ప్రియాంక చాలా మంచి అమ్మాయి, నాకెంతో ఇష్టం. ఓసారి ప్రియాంక మానస్‌ను హజ్బెండ్‌ మెటీరియల్‌ అంది. కానీ, మానస్‌ ఆమె కేవలం మరదలని చెప్పాడు. బిగ్‌బాస్‌ అనేది 110 రోజుల ఆట. ఈ షోలో ఎంతమంది జంటలు బయటకొచ్చారు? ఎంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు? ఏదైనా బిగ్‌బాస్‌ షో వరకే అని అందులో ఉన్న కంటెస్టెంట్లకు కూడా బాగా తెలుసు. కాకపోతే హౌస్‌లో ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. హౌస్‌లో మానస్‌కు ఎవరూ సెట్‌ కారు. నేను ఎవర్ని వేలు పెట్టి చూపిస్తే మానస్‌ ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. ప్రియాంక నా కొడుకును పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నేను ఒప్పుకోను. కావాలంటే ఆమెకు తగిన అబ్బాయిని చూసి పెళ్లి చేస్తా. అలా ప్రియాంకకు నేను సపోర్ట్‌ చేస్తాను, ఏదైనా సాయం చేస్తాను కానీ మానస్ తో మాత్రం పెళ్ళికి ఒప్పుకోను అని ఖరాకండిగా చెప్పింది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pushpaka Vimanam: మహబూబ్‌నగర్‌లో స్పెషల్ ప్రీమియర్ షో మీ కోసమే: రౌడీ హీరో

ఇంటర్వ్యూలో మానస్‌ ఫస్ట్‌ లవ్‌ గురించి కూడా చెప్పింది మానస్ తల్లి. మానస్ ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ.. అతడు చదువుతున్న సమయంలో ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళ్లిపోవడానికి రెడీ అయింది. దీంతో ఏం చేయాలని నన్ను అడిగాడు. నీదింకా చిన్న వయసు, సెటిల్‌ అవకుండా అమెరికా వెళ్లడం కరెక్ట్‌ కాదు అని చెప్పాను. మానస్‌ సరేనని ఆగిపోయాడు. అప్పట్నుంచి కెరీర్‌ మీద ఫోకస్‌ పెట్టాడు అని తెలిపింది.