Ram Charan
Ram Charan : స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి. ట్రైలర్ చూసిన దగ్గర్నుంచి ప్రేక్షకులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని జనవరి 7న పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.
దీంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే ముంబైలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు. వరుస ఈవెంట్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ టీం అంతా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. 1000 కోట్ల కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాని భారీగా ప్రమోట్ చేస్తున్నారు సినిమా టీం. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
Esther Anil : ‘దృశ్యం’ సినిమా పాప ఇప్పుడు ఎలా ఉందో చూడండి
తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల రామ్ చరణ్ ఓ ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో సినిమాతో పాటు చాలా విషయాలని పంచుకున్నారు. తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని చరణ్ తెలిపారు. చరణ్ అల్లు రామలింగయ్య గురించి మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ వాళ్ల నాన్న అల్లు రామలింగయ్య స్వాతంత్ర్య సమరయోధుడనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఆ రోజుల్లో ఆయన స్వాతంత్య్రం కోసం పోరాటం చేశారు. అందుకు 15 రోజులకుపైగా ఆయన్ని జైలులో కూడా పెట్టారు. ఈ విషయం మా కుటుంబసభ్యుల్లో కొద్ది మందికి మాత్రమే తెలుసు’’ అని చరణ్ తెలిపారు.