Allu Sirish
Allu Sirish : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అల్లు శిరీష్ ఇటీవలే తాను ఓ అమ్మాయిని ప్రేమించాను అని ప్రకటించి నిశ్చితార్థం చేసుకున్నాడు. అల్లు శిరీష్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అనేకమంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. అల్లు శిరీష్ తన నిశ్చితార్థ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.(Allu Sirish)
ఈ క్రమంలో అల్లు శిరీష్ తనకు కాబోయే భార్య నయనికతో లవ్ స్టోరీని రివీల్ చేసాడు. హీరో నితిన్ – అతని భార్య షాలినితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసి..2023 లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా నితిన్, షాలిని వాళ్ళ పెళ్ళికి స్పెషల్ పార్టీ హోస్ట్ చేసారు. ఆ పార్టీకి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా హాజరైంది. మొదటిసారి నేను నయనికని అక్కడే కలిసాను. రెండేళ్ల తర్వాత మేము హ్యాపీగా నిశ్చితార్థం చేసుకుంటున్నాము. నా పిల్లలు నా ప్రేమ కథ గురించి అడిగితే వాళ్ళ అమ్మని ఎలా కలిసానో చెప్తాను. నయనిక ఫ్రెండ్స్ కి చాలా థ్యాంక్స్. నన్ను కూడా మీ గ్రూప్ లోకి తీసుకొని మొదటి రోజు నుంచి దగ్గర చేసుకున్నందుకు అని పోస్ట్ చేసాడు.
Also See : Nara Rohith Wedding : హీరోయిన్ శిరీషతో హీరో నారా రోహిత్ పెళ్లి.. ఫోటోలు చూశారా?
నితిన్ భార్య షాలిని ఈ పోస్ట్ ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి మీ బ్యూటిఫుల్ స్టోరీలో నేను భాగమయినందుకు సంతోషంగా ఉంది అని పోస్ట్ చేయగా శిరీష్ దానికి రిప్లై ఇస్తూ.. థ్యాంక్యూ పెళ్లి పెద్ద అని కామెంట్ చేసాడు. దీంతో అల్లు శిరీష్ లవ్ స్టోరీ వైరల్ గా మారింది. నితిన్ – షాలిని ఇచ్చిన పార్టీలో నయనికని కలిసి అలా ఫ్రెండ్స్ అయి ప్రేమించుకొని ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు.