Allu Sneha Reddy : ఇన్‌స్టాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు స్నేహా రెడ్డి..
దేశంలో ఏ స్టార్ వైఫ్‌కి లేనంత ఫాలోవర్స్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదించుకున్నారు.. మొత్తంగా 4 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆమె ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పారు..

Allu Sneha Reddy
Allu Sneha Reddy: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. దేశంలో ఏ స్టార్ వైఫ్‌కి లేనంత ఫాలోవర్స్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదించుకున్నారు. మొత్తంగా 4 మిలియన్ల ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆమె ఓ సరికొత్త రికార్డు నెలకొల్పారు.
View this post on Instagram
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్నేహా ఈ ఘనత అందుకోవడం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన పిల్లలు అయాన్, అర్హలతో ఆడకునే స్వీట్ మూమెంట్స్‌తో పాటు తనకు ఆసక్తిగా అనిపించే పలు రంగాలకు సంబంధించిన పోస్ట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు స్నేహా.
అల్లు అర్జున్ ప్రస్తుతం బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌తో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేస్తున్నారు. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత వీళ్ల కాంబోలో రాబోతున్న ఈ హ్యాట్రిక్ ఫిలింపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన పుష్ప రాజ్ ఇంట్రో వీడియో తెలుగు ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ 70 మిలియన్స్ వ్యూస్ సాధించిన వీడియోగా రికార్డ్ సెట్ చేసింది.
View this post on Instagram