Manyam Dheerudu : ‘మన్యం ధీరుడు’ వస్తున్నాడు.. అల్లూరి సీతారామరాజు చరిత్ర..

తాజాగా ఇపుడు అల్లూరి జీవిత చరిత్రతో మరో సినిమా రాబోతుంది.

Alluri Sitarama Raju Story Manyam Dheerudu Movie Release Date Announced

Manyam Dheerudu : గతంలో అల్లూరి సీతారామరాజు చరిత్రపై పలు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇపుడు అల్లూరి జీవిత చరిత్రతో మరో సినిమా రాబోతుంది. RVV మూవీస్ బ్యానర్ పై ఆర్ పార్వతీదేవి సమర్పణలో నరేష్ డెక్కల దర్శకత్వంలో RVV సత్యనారాయణ నటించి, నిర్మించిన సినిమా ‘మన్యం ధీరుడు’. ఈ సినిమా షూటింగ్ పూర్తయి, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి రిలీజ్ కి రెడీగా ఉంది.

మన్యం ధీరుడు సినిమాని సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లలో చేసారు. అలాగే ఈ సినిమా కోసం బాగానే ఖర్చుపెట్టి ఒక ఊరు సెట్ కూడా వేశారు. అల్లూరి సీతారామరాజు నిజ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించమని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Read : NTR – Vishwak – Siddhu : విశ్వక్, సిద్ధూ జొన్నలగడ్డతో ఎన్టీఆర్ స్పెషల్ దేవర ఇంటర్వ్యూ.. ఫోటో లీక్..

ఈ సినిమా కోసం అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న RVV సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విలు విద్యలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో బ్రిటీష్ తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా వచ్చే ఓ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది అని సమాచారం.