Altercation between Prabhas fans and the police in Midnight at Prabhas Home
Prabhas Fans : నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అందరూ. అయితే కొంతమంది అభిమానులు నిన్న రాత్రి ప్రభాస్ ఇంటి వద్ద రోడ్లపై హల్ చల్ చేసారు.
దాదాపు 500 మంది వరకు ప్రభాస్ ఫ్యాన్స్ నిన్న రాత్రి 11 గంటల సమయంలో ప్రభాస్ ఇంటి దరిదాపుల్లోకి చేరుకొని హడావిడి చేయడం మొదలుపెట్టారు. ప్రభాస్ కి విషెస్ చెప్పాలంటూ ప్రభాస్ ఇంటి దగ్గర సందడి చేసారు. బ్యానర్లు, క్రాకర్స్, కేకులు పట్టుకొచ్చారు. అయితే అర్ధరాత్రి ఇలా హంగామా చేయడంతో పోలీసులు కూడా చేరుకొని అభిమానులను వారించారు.
Also Read : Prabhas Movies : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ నెక్స్ట్ సినిమాలు.. భారీ లైనప్..
ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభాస్ ను కలవాలంటూ అభిమానులు రోడ్డుపై కూర్చున్నారు. దీంతో ఆందోళనకు దిగిన ప్రభాస్ ఫ్యాన్స్ ని పోలీసులు చెదరగొట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.