×
Ad

Amala Akkineni: నా కోడళ్ళు అద్భుతమైన వారు.. వాళ్ళ వల్ల నా ప్రపంచం మారింది.. కోడళ్ల గురించి మొదటిసారి స్పందించిన అమల

అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. (Amala Akkineni)తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయినా ఆమె తక్కువ సినిమాలు మాత్రమే చేశారు.

Amala Akkineni made interesting comments about her daughters-in-law.

Amala Akkineni: అక్కినేని నాగార్జున సతీమణి అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయినా ఆమె తక్కువ సినిమాలు మాత్రమే చేశారు. ఆ తరువాత నాగార్జునను పెళ్లిచేసుకున్నారు. ఆ తరువాత నుంచి ఇంటి భాద్యతల్లోనే బిజీ బిజీ గా గడిపారు అమల. అయితే, చాలా కాలం తరువాత ఆమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒకే ఒక జీవితం సినిమాలలో తల్లి పాత్రలు చేశారు. ఇక మీడియాకి, సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉంటారు అమల. అలాంటి అమల చాలా కాలం తరువాత తన ముద్దుల ఇద్దరు కొత్త కోడళ్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. న కోడళ్ళు ఇద్దరు (Amala Akkineni)అద్భుతమైనవారు అంటూ ప్రశంసలు కురిపించింది.

Pawan Kalyan: పవన్ ని కలిసిన తమిళ నిర్మాత.. డేట్స్ ఫిక్స్ చేసిన టీం.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కోడళ్ళు శోభిత ధూళిపాల, జైనబ్ గురించి మాట్లాడుతూ.. “నా ఇద్దరు కోడళ్లు అద్భుతమైనవారు. వాళ్ల రాకతో నా జీవితం కొత్తగా మారింది. నాకొక ‘గర్ల్స్ సర్కిల్’ ఏర్పడింది. వాళ్ళు ఇద్దరూ చాలా బిజీగా ఉంటారు. అది చాలా మంచి విషయంగా భావిస్తాను. యువత ఎప్పుడు ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉండాలని కోరుకుంటాను. అలా వాళ్లు తమ పనుల్లో బిజీగా ఉంటే.. నేను నా పనుల్లో బిజీగా ఉంటాను. సమయం దొరికినప్పుడు అందరం కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తాం. అలాగే, నేను డిమాండ్‌ చేసే అత్తను కాదు, డిమాండ్‌ చేసే భార్యను కాదు” అంటూ చెప్పుకొచ్చింది అమల. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం నాగ చైతన్య దర్శకుడు కార్తీక్ వర్మతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అఖిల్ దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయినా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది.