Amala Paul Baby Shower Event Photos Goes Viral
Amala Paul : నటి అమలాపాల్ ఇటీవల తాను ప్రగ్నెంట్ అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంది. తాజాగా నేడు ఉదయం అమలాపాల్ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. సూరత్ లో అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఇంటి వద్ద ఈ వేడుకలు జరిగినట్టు తెలుస్తుంది. సీమంతం వేడుకలను ఘనంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు.
తాజాగా అమలాపాల్ తన సీమంతం వేడుక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. సాంప్రదాయంగా ఈ వేడుకలు చేసుకున్నట్టు తెలుస్తుంది. అమలాపాల్ కు కవల పిల్లలు పుడతారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అమలాపాల్ సీమంతం వేడుక ఫొటోలు వైరల్ అవ్వడంతో ఈ జంటకు కంగ్రాట్స్ చెప్తున్నారు నెటిజన్లు.
Also Read : Family Star Review : ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ రివ్యూ.. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిందా?
ఇక అమలాపాల్ కి ఇది రెండో పెళ్లి. అక్టోబర్ లో అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ గురించి తెలిపి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్ని రెండు నెలలకే అమలాపాల్ ప్రగ్నెంట్ అని చెప్పడం, బేబీ బంప్ తో కనిపించడం, వైరల్ అవ్వడం జరిగింది.