అమలాపాల్ పై కేసు…. చెల్లదని కొట్టేసిన కేరళ పోలీసులు

  • Publish Date - August 28, 2019 / 11:02 AM IST

కొచ్చిన్ : అందాల భామ అమలాపాల్  కొన్ని నెల‌ల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్న‌ట్టు త‌ప్పుడు చిరునామా  సృష్టించి ల‌గ్జ‌రీ కారు కొన్నారని అమ‌లాపాల్‌పై పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ ఆరోపణలతో ఆమె అరెస్ట్ అవ్వక తప్పదనే వార్తలు కూడా  పుకార్లు చేశాయి.

రూ.20 ల‌క్ష‌ల వెహికల్ టాక్స్ ఎగ్గొట్టి… చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డినందుకు అమ‌లాపాల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడి అప్ప‌ట్లో ఆదేశించారు. దీనిపై సెక్షన్ 430,468,471 సెక్షన్ల కింద క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. 

దీనిపై విచారించిన క్రైమ్ బ్రాంచ్ ..కారు కొన్నది బెంగుళూరులో,టెంపరరీ రిజిష్ట్రేషన్ అయ్యింది బెంగుళూరులో, పర్మినెంట్ రిజిష్ట్రేషన్ పుదుచ్చేరిలో జరిగింది. కేసు ఫైల్ అయింది కేర‌ళ‌లో. కాబ‌ట్టి ఇది మా ప‌రిధిలోకి రాదంటూ కేర‌ళ పోలీసులు కేసు కొట్టేసారు.