×
Ad

Yash Raj Films : నాలుగు వారాల తర్వాత ఓటీటీలోనే.. డీల్ అదిరిందిగా..

ఈ నాలుగు క్రేజీ మూవీస్.. నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి..

  • Published On : October 28, 2021 / 04:13 PM IST

Amazon Movies

Yash Raj Films: పాపులర్ ఓటీటీ మాధ్యమం అమెజాన్ ప్రైమ్, ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్‌తో సాలిడ్ డీల్ కుదుర్చుకుంది. లాక్ డౌన్ అప్పటినుంచి ఆడియన్స్ ఓటీటీలకు బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని సినిమాలు ఆఫ్టర్ థియేట్రికల్ రిలీజ్ ఓటీటీలకు వస్తుంటే మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదలవుతున్నాయి.

Pragathi Dance : వయసుతో పనిలేదు.. ఊపొస్తే ఊపాల్సిందే..

ఇప్పుడు నాలుగు క్రేజీ సినిమాల డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ‘బంటీ ఔర్ బబ్లీ’, ‘పృథ్వీరాజ్’, ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘షంషేరా’ సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

Pushpa Movie : యూత్‌కి స్లో పాయిజన్.. ‘సామీ సామీ’ అని ఎన్నిసార్లు పిలిచిందంటే సామీ…

అది కూడా నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత అన్నమాట. ఇందుకుగాను యష్ రాజ్ ఫిల్మ్స్‌కు వందల కోట్లు ముట్టజెప్పారని టాక్. ‘బంటీ ఔర్ బబ్లీ’ నవంబర్ 19న రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’, రణ్‌వీర్ సింగ్ ‘జయేష్ భాయ్ జోర్దార్’, రణ్‌బీర్ కపూర్ ‘షంషేరా’ సినిమాల మీద మంచి అంచనాలున్నాయి.

Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..