Amazon Prime officially announces Kantara: Chapter 1 OTT release date
Kantara: Chapter 1 OTT: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కాంతార: చాఫ్టర్ 1. బ్లాక్ బస్టర్ కాంతార సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి కూడా పాజిటీవ్ టాక్ వచ్చింది. దీంతో, ఈ సినిమాను చేసేందుకు ఆడియన్స్ ఎగబడ్డారు. మొదటిరోజే ఏకంగా వందకోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా బ్రేకీవెన్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
Malavika Sharma: ఎద అందాలతో మత్తెక్కిస్తున్న మాళవిక శర్మ.. ఫోటోలు
ఇక తాజాగా కాంతార: చాఫ్టర్ 1 సినిమా ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ రానున్నట్టు ప్రకటించింది. దీంతో, కాంతార: చాఫ్టర్ 1 సినిమా ఓటీటీ విడుదల కోసం చూస్తున్న ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువగా.. ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
get ready to witness the LEGENDary adventure of BERME 🔥#KantaraALegendChapter1OnPrime, October 31@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets @gulshandevaiah #ArvindKashyap @AJANEESHB @HombaleGroup pic.twitter.com/ZnYz3uBIQ2
— prime video IN (@PrimeVideoIN) October 27, 2025