Ambas Revenge : తెలుగులో తొలి ఏఐ ఫీచర్ ఫిల్మ్ ‘అంబ’స్ రివెంజ్’.. టీజర్ రిలీజ్..
ఏఐ సాంకేతికకతో రూపొందుతున్న మూవీ అంబా'స్ రివెంజ్ (Ambas Revenge).
- Thota Vamshi Kumar
- Updated on- August 27, 2026 / 08:35 PM IST
Ambas Revenge Official Teaser out now
Ambas Revenge : ఏఐ సాంకేతికకతో రూపొందుతున్న మూవీ అంబా’స్ రివెంజ్. జైవర్ధన్ మేడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్ పై యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రమోద్ ఎంసి సంగీతాన్ని అందిస్తున్నారు. మహాభారతంలోని అంబ ప్రతీకారం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ.. శిఖండితో మొదలుపెట్టి అంబ కథని చెబుతున్నామన్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలను పరిచయం చేయడం కోసమే టీజర్‌ను విడుదల చేశామన్నాడు. త్వరలో ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు.
