Toxic : దానివల్లే టాక్సిక్ సినిమాకి దెబ్బ పడిందా..?
టాక్సిక్ (Toxic) మాత్రం టాలీవుడ్ స్పీడ్‌కు బ్రేకర్‌గా మారిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Did that deal a blow to the movie Toxic
Toxic : టాలీవుడ్లో కొంతకాలంగా చిన్న సినిమా నుంచి పెద్ద మూవీ వరకు వరుస విజయాలు నమోదవుతున్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతూ, నిర్మాతలకు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఇలాంటి పాజిటివ్ ఫేజ్‌లో రిలీజ్ అయిన టాక్సిక్ మాత్రం టాలీవుడ్ స్పీడ్‌కు బ్రేకర్‌గా మారిందనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సినిమాపై వచ్చిన టాక్ ఒక ఎఫెక్ట్ అయితే, టికెట్ రేట్ల పెంపు మరో పెద్ద ఎఫెక్ట్ చూపిందనే కామెంట్స్ వస్తున్నాయి.
సాధారణ ప్రేక్షకుడు కుటుంబంతో కలిసి సినిమా చూడాలంటే భారీ ఖర్చు అవుతుండటంతో థియేటర్‌కు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. టికెట్ రేట్స్ పెంచకుండా టాక్సిక్ను నార్మల్ టికెట్ రేట్లకు విడుదల చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే టాక్ కూడా నడుస్తోంది. టాక్ ఎలా ఉన్నా స్టార్ హీరో సినిమా కావడంతో మొదటి నాలుగైదు రోజులైనా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చేదని, కానీ పెంచిన టికెట్ రేట్సే టాక్సిక్‌కు గుదిబండగా మారాయంటున్నారు.
Kangana Ranaut : కృతి సనన్ ని అంటావా?.. కంగనాను ఆడుకుంటున్న నెటిజన్లు.. పాత ఫొటో బీభత్సంగా వైరల్..
ఇక నుంచి టికెట్ల రేట్ల పెంపు ఉండదని అప్పట్లో తెలంగాణ సీఎం తేల్చి చెప్పారు. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇక నో టికెట్ రేట్స్ హైక్ అంటూ చెప్పుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ మాట మీద నిలబడలేదు. ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్‌తో అయినా..టికెట్ ధరల విషయంలో మేకర్స్ డెసిషన్ మారుతుందో లేదోనన్న చర్చ మొదలైంది.
కలెక్షన్లను పెంచుకోవడానికి టాక్సిక్ మూవీ టికెట్ రేట్లను తగ్గిస్తారా.? లేక ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం మరో 10 రోజుల వరకు ఇదే పెంచిన ధరలను కొనసాగిస్తారా.? హాట్ టాపిక్‌గా మారింది. రేట్లు తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ మళ్లీ థియేటర్ల వైపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టాక్సిక్ విషయంలో టికెట్ రేట్లే నిజంగా బాక్సాఫీస్ గేమ్‌ను మార్చేశాయా.? లేక సినిమాపై వచ్చిన టాకే ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ను తగ్గించిందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
