Neethu Natraj : బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. నీతూ నటరాజ్ మాస్టర్.. ఆమె గురించి తెలుసా?
మూడో వైల్డ్ కార్డు ఎంట్రీగా నీతూ నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చింది. (Neethu Natraj)
Neethu Natraj
Neethu Natraj : ఈ వారం ఎలిమినేషన్ తో పాటు అయిదుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా వస్తారని నిన్నే ప్రకటించారు నాగార్జున. చెప్పినట్టే నేడు మొదటి వైల్డ్ కార్డు ఎంట్రీగా సీరియల్ నటుడు శివకుమార్, రెండో వైల్డ్ కార్డు ఎంట్రీగా నటి దక్షి గుత్తికొండ ఎంట్రీ ఇచ్చారు. మూడో వైల్డ్ కార్డు ఎంట్రీగా నీతూ నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చింది. నటరాజ్ మాస్టర్ భార్యగా నీతూ నటరాజ్ మాస్టర్ అందరికి పరిచయమే.
నీతూ గుజరాతి అమ్మాయి. డ్యాన్స్ షోలతో కెరీర్ మొదలు పెట్టింది. తెలుగులో కూడా పలు డ్యాన్స్ షోలలో పాల్గొంది. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా కూడా వర్క్ చేసింది. నటరాజ్ మాస్టర్ తో లవ్ మ్యారేజ్ చేసుకొని పలు టీవీ షోలలో, డ్యాన్స్ షోలలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫేమ్ ఉంది. వీళ్లకు ఒక పాప ఉంది. నటరాజ్ మాస్టర్ గతంలో బిగ్ బాస్ సీజన్ 5, బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్నారు. ఇప్పుడు నీతూ నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram
