Ameesha Patel : బద్రి, నాని.. లాంటి పలు సినిమాలతో తెలుగులో మెప్పించిన హీరోయిన్ అమీషా పటేల్ ప్రస్తుతం పలు బాలీవుడ్, పంజాబీ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా అమీషా పటేల్ గదర్ 2 సినిమాలో నటించింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 2001లో వచ్చిన గదర్ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థపై హీరోయిన్ అమీషా పటేల్ ట్విట్టర్ లో ఫైర్ అయింది.
అమీషా పటేల్ తన ట్వీట్స్ లో..ఇటీవలే గదర్ 2 సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రొడక్షన్ వాళ్ళు అసలు పట్టించుకోలేదు. మేకప్ ఆర్టిస్ట్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఇతర సాంకేతిక నిపుణులు ఎవ్వరికి కూడా పేమెంట్స్ ఇవ్వలేదు. నటీనటులకు కనీసం ఫుడ్ బిల్స్ చెల్లించలేదు, ట్రావెలింగ్ ఏర్పాట్లు చేయలేదు. షూటింగ్ అయ్యాక అక్కడే ఒంటరిగా వదిలేశారు చాలామందిని. షూటింగ్ చివరి రోజున బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయారు. గదర్ 2 సినిమాని అనిల్ శర్మ ప్రొడక్షన్స్ నిర్వహిస్తుంది అని మీకు తెలుసు. వాళ్ళు జీ స్టూడియోస్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి సరిపోయింది. జీ స్టూడియోస్ వాళ్ళు రంగంలోకి దిగి మా బకాయిలు చెల్లించారు. ఈ సమస్య సాల్వ్ అవ్వడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు అని తెలిపింది. దీంతో అమీషా పటేల్ ఫ్యాన్స్, నెటిజన్స్ గదర్ 2 నిర్మాణ సంస్థపై విమర్శలు చేస్తున్నారు.
Another concern of fans has been about certain incidents regarding ANIL SHARMA PRODUCTIONS to have taken place in regards to the final schedule of GADAR 2 that took place end May in CHANDIGARH!! 1/4
— ameesha patel (@ameesha_patel) June 30, 2023
There were certain queries that many technicians like make up artists,costume designers n others etc did not receive their rightful remuneration and dues from ANIL SHARMA PRODUCTIONS!!Yes they did not !! But @ZeeStudios_ stepped in and made sure all dues were settled as they are…
— ameesha patel (@ameesha_patel) June 30, 2023
Yes from accommodation, to transport to Chandigarh airport on the final day to food bills were left unpaid and cars were not provided to certain cast and crew members leaving them stranded ! But yet again @zeestudios stepped in and corrected these issues caused by ANIL SHARMA…
— ameesha patel (@ameesha_patel) June 30, 2023