Ram Charan – Upasana : ఉపాసన ట్వీట్‌కి రిప్లై ఇచ్చిన అమెరికన్ డాక్టర్.. రామ్‌చరణ్ ఫస్ట్ బేబీ డెలివరీ!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికన్ పాపులర్ టాక్ షో 'గుడ్ మార్నింగ్ అమెరికా'లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ టాక్ షోలో అమెరికన్ ఫేమస్ డాక్టర్ మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా అంటూ వ్యాఖ్యానించింది. ఇక ఈ వ్యాఖ్యలు పై ఇటీవల ఉపాసన స్పందిస్తూ..

american doctor Jennifer Ashton replies to upasana request

Ram Charan – Upasana : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికన్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ టాక్ షోలో రామ్ చరణ్ తో పాటు అమెరికన్ ఫేమస్ డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ కూడా పాల్గొంది. ఇక షోలో ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె రామ్ చరణ్‌తో.. ‘మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా, అందుకోసం మీతో ప్రపంచంలో ఎక్కడికి రమ్మన్నా వస్తాను’ అంటూ వ్యాఖ్యానించింది.

Upasana : అమెరికన్ ఫేమస్ డాక్టర్‌ని అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వమంటున్న ఉపాసన.. ఎందుకు?

ఇక ఈ వ్యాఖ్యలు పై ఇటీవల ఉపాసన స్పందించింది. ‘డాక్టర్ జెన్నిఫర్ ఆష్‌టన్ మీ మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. మిమ్మల్ని కలవడానికి నేను ఎదురు చూస్తున్నా. మా ఫస్ట్ బేబీని డెలివరీ చేయడానికి మీరు అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అవ్వచ్చుగా’ అంటూ రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. తాజాగా ఉపాసన రిక్వెస్ట్ కి డాక్టర్ జెన్నిఫర్ బదులిచ్చింది. “అందుకు నాకు అంగీకారమే” అంటూ కామెంట్ చేసింది. దీంతో మెగా వారసుడు ఇండియన్ ఫేమస్ హాస్పిటల్ అపోలో లో అమెరికన్ ఫేమస్ డాక్టర్ జెన్నిఫర్ చేతులు మీదగా ఈ ప్రపంచంలోకి రాయల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

కాగా 10 ఏళ్ళ వివాహ బంధం తరువాత రామ్ చరణ్ అండ్ ఉపాసన తమ మొదటి బిడ్డకు జన్మని ఇవ్వబోతున్నట్లు ఇటీవల చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ శుభవార్తని రామ్ చరణ్ మొదటిగా తన స్నేహితుడు ఎన్టీఆర్ తో షేర్ చేసుకున్నట్లు తాజా హాలీవుడ్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మెగా వారసుడు వస్తున్నాడు అని తెలిసిన దగ్గర నుంచి.. మెగా కుటుంబంలో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక మెగా అభిమానుల ఆనందానికి అయితే హద్దులు లేవు.

american doctor Jennifer Ashton replies to upasana request

american doctor Jennifer Ashton replies to upasana request