కోలీవుడ్ బ్యూటీ నయన్ తార మరోసారి ప్రియుడితో విడిపోయినట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన కొత్త ప్రియుడు డైరక్టర్ విగ్నేష్ శివన్ కు నయన్ బ్రేకప్ చెప్పేసింది అని ఫిల్మ్ సర్కిల్స్ నుంచి గుసగుసలు వినిపించాయి. అయితే దీనంతటికి కారణం..ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్ కి నయన్ బాయ్ ఫ్రెండ్ తో కాకుండా సింగిల్ గా హాజరుకావడమే. అంతేకాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించి నయన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలలో విగ్నేస్ శివన్ లేకపోవడంతో కూడా నయన్ కు విగ్నేష్ కు చెడిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే తమ విషయంలో వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాలని విగ్నేష్ డిసైడ్ అయ్యాడు. తాను,నయన్ ఇంకా కలిసే ఉన్నాం అని అర్థమయ్యేలా ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. తమ మధ్య దూరం పెరగలేదని అర్థం వచ్చేలా నయన్,తాను కలిసి తీసుకున్న సెల్ఫీని విగ్నేష్ షేర్ చేశాడు. దీంతో నయన్,విగ్నేష్ ఇంకా లవ్ లోనే ఉన్నారని అర్థమవుతోంది.
నానుమ్ రౌడీ దాన్(నేనూ రౌడీనే)సినిమాతో డైరక్టర్ విగ్నేష్ శివన్ తో కలిసి పనిచేసిన నయన్ ఆ సినిమా సమయం నుంచి ఇద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరూ తమ ప్రేమ విషయం గురించి బహిరంగంగా బయటకి చెప్పకపోయినప్పటికీ…పలు ఔటింగ్స్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం లాంటివి ద్వారా తాము రిలేషన్ షిప్ లో ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు. అప్పట్లో శింబు.. ఆ తరువాత ప్రభుదేవాలతో సహజీవనం చేసిన నయన తార వారిద్దరికి బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రభుదేవాతో రిలేషన్ షిప్ అయితే పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది.