తనను కలవడానికి అభిమానులెవరూ రావద్దని అమితాబ్ సూచన చేశారు..
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఆదివారం ఆయన తన అభిమానులను కలిసేందుకు కొంత సమయం కేటాయిస్తారు. తన ఇంటి గేటు వద్దకు వచ్చిన అభిమానులను అందరినీ పలకరించి వెళుతుంటారు.
అయితే.. ఈ ఆదివారం తనను కలిసేందుకు ఎవరూ రావద్దని అభిమానులకు అమితాబ్ సూచన చేశారు. తనను కలిసేందుకు జల్సా గేట్ వద్దకు రావొద్దని, తాను రావడం లేదని ఆయన చెప్పారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు అర్థం చేసుకోవాలని.. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తగు జాగ్రత్తలు తీసుకుని..
అందరూ అప్రమత్తంగా ఉండాలని బిగ్‌బీ సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. భారత్‌లో కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకూ ఇద్దరు మరణించగా.. మార్చి 15 నాటికి 105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
T 3470 – To all Ef and well wishers an earnest request !PLEASE DO NOT COME TO JALSA GATE TODAY .. SUNDAY MEET am not going to come !
Take PRECAUTIONS .. be safe
Sunday का दर्शन Jalsa पे cancel है , कृपया कोई वहाँ जमा ना हों आज श्याम को ।
सुरक्षित रहें??? pic.twitter.com/USm4kZBEYo— Amitabh Bachchan (@SrBachchan) March 15, 2020