Amitabh Bachchan tweet on PapamPasivadu
Amitabh Bachchan tweet : సింగర్‌గా, హోస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీరామచంద్ర (Sreerama Chandra). పాపం పసివాడు అనే వెబ్ సిరీస్‌లో ఆయన నటించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న ఆహా సంస్థలో శుక్రవారం (సెప్టెంబర్ 29) నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవలే ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. తాజాగా బాలీవుడ్ నటుడు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ సైతం ఈ వెబ్ సిరీస్ గురించి ట్వీట్ చేశారు.
‘పాపం పసివాడు. ట్రైలర్ వదిలాడు. ఇగ హంగామా షురూ.. కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా చూసేయండి. రేపటి నుంచి ఆహాలో పాపం పసివాడు స్ట్రీమింగ్ అవుతోంది. ‘అని బిగ్‌బి ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దీనిపై ఆహా స్పందించింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాపం పసివాడు పై ప్రేమను కురిపించడం నిజంగా చాలా ప్రత్యేకణమైన క్షణం అంటూ అమితాబ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.
Yes! That just happened? None other than Big B @SrBachchan showering love on #PapamPasivadu ❤️ A very special moment indeed…@Sreeram_singer https://t.co/jdi4b74RWQ
— ahavideoin (@ahavideoIN) September 28, 2023
Allu Arjun : క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న ఫిలిం టీజర్ రిలీజ్..
లలిత్ కుమార్ దర్శకత్వంలో పాపం పసివాడు సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌లో రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీ విద్యా మహర్షి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జోస్ జిమ్మి సంగీతాన్ని అందించగా, ది వీకెండ్ షో పతాకంపై అఖిలేష్ వర్థన్ నిర్మించారు.