Shweta Nanda : కోట్లు విలువ చేసే బంగ్లాను కూతురికి బహుమతిగా ఇచ్చిన నటుడు

ఆ నటుడు కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ఆ బంగ్లా. ఇప్పుడు కోట్లు విలువ చేస్తుంది.. ఆ బంగ్లాను తన గారాల తనయకు బహుమతిగా ఇచ్చేసారు. ఇంతకీ ఏ నటుడు?

Shweta Nanda

Shweta Nanda : బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేత నందాకు అపూర్వమైన బహుమతిని ఇచ్చారు. ముంబయి జుహులో ఉన్న ‘ప్రతీక్ష’ బంగ్లాను కుమార్తెకు కానుకగా ఇచ్చారు.

Ileana D’Cruz : ఎట్టకేలకు తన భర్తని చూపించిన ఇలియానా.. అతడేనట..

అమితాబ్ తన కూతురు శ్వేత నందాకి కోట్లు విలువ చేసే బంగ్లాను కానుకగా ఇచ్చిన వార్త ఆసక్తికరంగా మారింది. ముంబయి జుహులో ఉన్న ‘ప్రతీక్ష’ బంగ్లాను శ్వేతకు రాసిచ్చారు. అమితాబ్ కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ‘ప్రతీక్ష’. ఆ ఇంట్లో అమితాబ్ తన తల్లిదండ్రులు లెజెండరీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్, తేజీ బచ్చన్‌లతో ఉండేవారు. హరివంశ్ రాయ్ బచ్చన్ ఆ ఇంటికి ‘ప్రతీక్ష’ అని పేరు పెట్టారట.

అమితాబ్ శ్వేతకు గిఫ్ట్‌గా ఇచ్చిన బంగ్లా జుహులోని విఠల్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలోకి వస్తుంది. ఈ బంగ్లా రెండ్లు ప్లాట్లుగా ఉంటుంది. ఒకటి 890.47 చదరపు మీటర్లు కాగా.. మరొకటి 674 చదరపు మీటర్లు. ఈ ఆస్తి విలువ రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. ప్రతీక్ష బంగ్లా ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఉంటున్న ‘జల్సా’ ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అమితాబ్ తన కుమార్తెకు బహుమతిగా నవంబర్ 9 న బంగ్లాను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. స్టాంప్ డ్యూటీగా రూ.50.65 లక్షలు కూడా చెల్లించారు.

Kotabommali PS Review : కోట బొమ్మాళి పిఎస్ మూవీ ఎలా ఉంది..?

2007 లో అమితాబ్ కొడుకు అభిషేక్, నటి ఐశ్వర్య వివాహ వేడుకలు ‘ప్రతీక్ష’ ,’జల్సా’ బంగ్లాలో జరిగాయి. ఇదే ప్రాంతంలో ఉన్న ‘జనక్’ అనే ఇంటిని అమితాబ్ ఆఫీసు కోసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ తన గారాల తనయ శ్వేత నందకు బహుమతిగా అన్ని కోట్ల ఆస్తిని ముట్టచెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు