కోలుకున్న అమితాబ్, ‘కెబిసి-12’ షూటింగ్‌ మొదలుపెట్టేశారు.. కాకపోతే ఒకటే కండీషన్..

  • Published By: sekhar ,Published On : August 24, 2020 / 12:31 PM IST
కోలుకున్న అమితాబ్, ‘కెబిసి-12’ షూటింగ్‌ మొదలుపెట్టేశారు.. కాకపోతే ఒకటే కండీషన్..

Updated On : August 26, 2020 / 1:22 PM IST

Amitabh Bachchan is back on sets of KBC 12: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తనకు గ్రేట్ కమ్‌బ్యాక్ అయిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్-12 షూటింగులో పాల్గొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. ఇటీవల కరోనా బారినపడి ముంబైలోని నానావతి హాస్పిటల్లో చికిత్సపొంది కోలుకున్నారు అమితాబ్.



ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, తగిన జాగ్రత్తలు తీసుకుని కెబిసి-12 షూటింగులో పాల్గొన్నానంటూ ఆయన సెట్‌లో తీసిన ఫొటో షేర్ చేశారు.
ఇదిలాఉంటే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో ప్రారంభమై ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తవుతుంది.

2000వ సంవత్సరంలో అమితాబ్ హోస్ట్‌గా స్టార్ట్ అయిన ‘కెబిసి’ విజయవంతంగా 11 సీజన్లు పూర్తి చేసుకుని 12వ సీజన్‌లోకి ఎంటర్ అయింది.



‘కెబిసి’తో ఇన్ని సంవత్సరాల జర్నీ అద్భుతంగా ఉంది.. దట్స్ ఎ లైఫ్ టైం.. అంటూ అమితాబ్ పోస్ట్ చేశారు. అమితాబ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో ఆయనకు లైఫ్ ఇచ్చిందని పలు సందర్భాల్లో బిగ్‌బి చెప్పిన సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/CEPhKaxB9w7/?utm_source=ig_web_copy_link