అమితాబ్ బచ్చన్‌కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు

బాలీవుడ్ ఐకాన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కె అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. 

రెండు జనరేషన్లకు స్ఫూర్తి కలిగించేలా నిలిచిన లెజెండ్ అమితాబ్ బచ్చన్‌ ఏకగ్రీవంగా దాదాసాహెబ్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశమంతా, అంతర్జాతీయ సినిమా వ్యవస్థ ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేస్తుంది. ‘బిగ్ బీ’కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని జవదేకర్ ప్రకటించాడు. 

1969లో సాత్ హిందుస్తానీ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ఆయన, నిర్మాతగా, టీవీ నటుడిగా, సినిమా హీరోగా పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. నిర్విరామంగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆయన చివరి చిత్రం బద్లా.