తొలిసారిగా బయటకొచ్చిన అమితాబ్ ను చూశారా

  • Publish Date - August 15, 2020 / 09:36 AM IST

కరోనా నుంచి బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనాను ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యవంతంగా తిరిగి వచ్చారు. కోలుకున్న తర్వాత..తొలిసారిగా బయటకు వచ్చారు. ఓ చెట్టు దగ్గర ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



ఆయన ఇంటి ఆవరణలో కొన్ని సంవత్సరాల కిందట..నాటిన చెట్టు..భారీ చెట్టు కూలిపోయింది. దీంతో ఆ స్థానంలోనే మరో చెట్టును నాటి..ఫొటో దిగారు బిగ్ బి. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను వెల్లడించారు. 1976లో తన ఇంట్లో గుల్ మొహర్ చెట్టును తానే స్వయంగా నాటానని తెలిపారు.

కానీ..ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు చెట్టు కోల్పోవడం జరిగిందన్నారు. ఆగస్టు 12వ తేదీన అమ్మ పుట్టిన రోజు సందర్భంగా…చెట్టు పడిన ప్రాంతంలో అమ్మ తేజి బచ్చన్ పేరిట కొత్త గుల్ మొహర్ చెట్టును నాటినట్లు వెల్లడించారు బిగ్ బి.





ట్రెండింగ్ వార్తలు