నన్ను బిగ్ బాస్ లోకి తీసుకుంటే వాళ్లకే నష్టం.. ఏం లాజిక్ చెప్పాడు డాక్టర్ బాబు..
తాజాగా నిరుపమ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. (Nirupam Paritala)
Nirupam Paritala
Nirupam Paritala : బిగ్ బాస్ లోకి సీరియల్ సెలబ్రిటీలు ఎక్కువగానే వెళ్తుంటారు. ప్రతి సీజన్ లోను తెలుగులో ముగ్గురు నుంచి నలుగురు సీరియల్ యాక్టర్స్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తారు. కార్తీక దీపం ఫేమ్ సీరియల్ నటుడు నిరుపమ్ పరిటాల కూడా గతంలో బిగ్ బాస్ లోకి వస్తారని వార్తలు వచ్చాయి.
తాజాగా నిరుపమ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.
నిరుపమ్ పరిటాల మాట్లాడుతూ.. నన్ను ఛానల్ వాళ్ళు బిగ్ బాస్ అడగరు. ఎందుకంటే నా సీరియల్స్ మా టీవీ లోనే. బిగ్ బాస్ చేయాలంటే ఆ సీరియల్స్ ఆగిపోతాయి. అది ఛానల్ వాళ్ళకే కష్టం. అందుకే నన్ను అడగరు. కానీ బిగ్ బాస్ కి నన్ను కూడా అనుకున్నారు అని తెలిసింది నా దాకా వచ్చి ఎవరూ అడగలేదు. నేను అయితే బిగ్ బాస్ ని ఫాలో అవుతాను. కానీ ఛాన్స్ వస్తే చేస్తానోలేదో మాత్రం తెలీదు అని తెలిపారు. దీంతో నిరుపమ్ పరిటాల బిగ్ బాస్ లోకి వచ్చే అవకాశం లేదనే తెలుస్తుంది.
