Amma Rajashekar : కొడుకుని హీరోగా చేస్తున్న అమ్మ రాజశేఖర్.. ‘తల’ టీజర్ రిలీజ్..

అమ్మ రాజశేఖర్ ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నాడు.

Amma Rajashekar Introducing his Son Amma Raagin Raj with Thala Movie

Amma Rajashekar : డ్యాన్స్ మాస్టర్ గా, నటుడిగా, దర్శకుడిగా ఇన్నాళ్లు ప్రేక్షకులను మెప్పించిన అమ్మ రాజశేఖర్ ఇప్పుడు తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తున్నాడు. అమ్మ రాజశేఖర్ తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేస్తూ తన దర్శకత్వంలోనే ‘తల’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్బీ చౌదరి నిర్మాణంలో ఎన్ వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మాతలుగా ఈ తల సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అమ్మ రాగిన్ రాజ్, రోహిత్, ఎస్తేర్ నొరొన్హ, ముక్కు అవినాష్, సత్యం రాజేశ్, అజయ్, రాజీవ్ కనకాల, ఇంద్రజ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా నేడు ఈ సినిమా టిజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు.

Also Read : Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?

తల టీజర్ చూస్తుంటే హీరో ఒక ఇద్దర్ని రోడ్డు మీద ముక్కలు ముక్కలు నరికి కూర్చున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ఇదేదో మాస్ యాక్షన్ రివెంజ్ స్టోరీలా అనిపిస్తుంది. మీరు కూడా తల టీజర్ చూసేయండి..

ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్లో డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు ఈ తల సినిమా అంతే ముఖ్యం. నా కెరీర్ లో దేవుడిగా భావించేది ఆర్బీ చౌదరి గారిని. ఆయన నాకు డ్యాన్స్ మాస్టర్ గా ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఆర్బీ చౌదరి గారి నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్ ని హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్, ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్ కు మీ బ్లెస్సింగ్ ఇస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఎస్తేర్ నోరాన్హా మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను నటించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇలాంటి రోల్ లో నన్ను తీసుకోవడం సర్ ప్రైజ్ అనిపించింది అని తెలిపింది. హీరో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ.. నేను హీరోగా మారినప్పటి నుంచే ప్రేక్షకులే నాకు అన్నీ అనుకున్నాను. వాళ్లు ఎలా ఉండాలని కోరుకుంటారో నేను అలా ఉంటాను. నాన్న తల సినిమా కథ చెప్పినప్పుడు సినిమా, నా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో నేను మనసులో ఊహించుకున్నాను. తప్పకుండా మీరంతా థ్రిల్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు.