Sankranthiki Vasthunam : వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?
ఈసారి సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడనున్నాయి.

Venkatesh Sankranthiki Vasthunam Movie Release Date Announced
Sankranthiki Vasthunam : ఈసారి సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడనున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఇక బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా జనవరి 12న రిలీజ్ కానుందని ప్రకటించారు. వెంకటేష్ సినిమా మాత్రం రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
తాజాగా నేడు వెకంటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా సంక్రాంతి రోజు జనవరి 14 న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈసారి సంక్రాంతికి ఏ రేంజ్ లో వెంకీమామ నవ్విస్తాడో చూడాలి.
ఇక ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబోలో F2, F3 సినిమాలు వచ్చి హిట్ అవ్వగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.