Amma : మదర్స్ డే రోజు.. ‘అమ్మ’ షార్ట్ ఫిలిం

అమ్మ షార్ట్ ఫిలిం మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మే 11న‌ రిలీజ్ కానుంది.

Amma Short Film Releasing on Mothers Day

Amma : అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మ సెంటిమెంట్ తో అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అమ్మ విలువను చెప్తూ అమ్మ అనే సందేశాత్మక షార్ట్ ఫిలిం తెరకెక్కుతుంది. ఏఏఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో, నాట్యమార్గం సహకారంలో తెరకెక్కిన అమ్మ షార్ట్ ఫిలిం మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా మే 11న‌ రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి తెర‌పై అమ్మగా కనిపించబోతుంది. ఈ సందర్భంగా ఇంద్రాణి మాట్లాడుతూ.. ఏమీ యాచించని నిస్వార్థ ప్రేమమూర్తి అమ్మ. అలాంటి ఓ అమ్మ కథను చూపించే సందేశాత్మక సినిమా మా అమ్మ అని తెలిపారు. ఈ షార్ట్ ఫిలిం డైరెక్టర్ హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ.. మనకి కష్టం వస్తే కన్నీరు కార్చే అమ్మకే బాధ కలిగిస్తే ఆమె పడే ఆవేదన ఎలా ఉంటుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపించే అమ్మకు మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం అనే సబ్జెక్ట్ తో ఈ ఫిలిం ఉండనుంది అని తెలిపారు.

Also Read : Pawan Kalyan : ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే.. 96ఏళ్ల వృద్ధురాలికి దగ్గరుండి భోజనం వడ్డించిన డిప్యూటీ సీఎం.. ఆ బామ్మ చేసిన పనికి..

ఈ షార్ట్ ఫిలింలో ఇంద్రాణి దవలూరు, సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.