ఏడేళ్లపాటు ఏకధాటిగా ప్రసారమై బుల్లితెరపై సంచలనం సృష్టించిన ‘అమృతం’ తెలుగు ప్రేక్షకులను మరింతగా అలరించడానికి, కాలానికనుగుణమైన మార్పులతో మళ్లీ రానుంది. zee5 మరియు Lightbox Media అధినేత గుణ్ణం గంగరాజు సంయుక్తంగా ‘అమృతం ద్వితీయం’ (మూర్ఖత్వానికి మరణం రాదు)..
సీరియళ్లంటేనే ఏడుపులు, పెడబొబ్బలు అనుకుని అలవాటు పడిపోయిన కాలంలో స్వచ్ఛమైన హాస్యంతో ఇంటిల్లిపాదినీ నిండుగా నవ్వించిన అమృతం ఇప్పుడు కొత్త హంగులతో రానుంది. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ట్రైలర్ రిలీజ్ చేయగా.. శుక్రవారం (మార్చి 13) యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్ 2 నుండి టాప్ 1కి చేరుకుంది. దీన్ని బట్టి అమృతం పట్ల ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.
హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి పూర్వ పాత్రలే పోషించగా, L.B శ్రీరామ్ అంజి పాత్రలో, సత్య క్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్ మరియు రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఉగాది కానుకగా మార్చి 25 నుంచి zee5 లో ‘అమృతం ద్వితీయం’ ప్రసారం కానుంది..
Also Read | హైదరాబాద్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ బంద్..