యమ్మీగా అమీ జాక్సన్.. బ్యాక్ టూ స్లిమ్ లుక్

డైరక్టర్ శంకర్ ‘ఐ’ మూవీ హీరోయిన్ అమీ జాక్సన్ మళ్లీ స్లిమ్ అండ్ గ్లామరస్ లుక్ లోకి వచ్చేసింది. లండన్ లో ఉండే ఈ బ్యూటీ ఇటలీలో వేకేషన్ ను ఎంజాయ్ చేస్తూ ఫొటోలు పోస్టు చేసింది. కాబోయే భర్త జార్జ్ పనయితో కలిసి ట్రిప్ ను జోష్ గా గడిపేస్తుంది. ఈ టూర్ ఫొటోలన్నింటినీ ఇన్ స్టాలో పంచుకుంటుంది. మనకంటే సూర్యుడు, వేడి ఎక్కువ గానీ అక్కడ సన్ బాత్ అంటే ఓ పిచ్చి మరి. అందుకే సూర్యుడి ఎండను ఎంజాయ్ చేస్తున్నామంటూ పోస్టు పెట్టింది.

గతేడాది సెప్టెంబరులోనే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్.. తన ప్రియుడిని త్వరలోనే వివాహం చేసుకోనుందట. అమీ జాక్సన్ చివరిగా శంకర్ డైరక్ట్ చేసిన రోబో 2.0లో మాత్రమే కనిపించింది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నప్పుడే సినిమాలకు బ్రేక్ ఇచ్చింది ఈ అమ్మి.

ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న అమీ జాక్సన్.. నిండు నెలలతో గర్భం దాల్చి కనిపించి మళ్లీ నాజూకుగా మారిపోయి.. స్లిమ్ లుక్ లో కనిపిస్తుంది. ఇదంతా తన కల అని.. ఇటలీలో ఎంజాయ్ చేయడమంటే తనకు చాలా ఇష్టమని అదే స్లిమ్ బాడీతో ఫొటోలు పోస్టు చేసింది అమీ జాక్సన్.