An Action Hero : యాక్షన్ హీరోగా ఆయుష్మాన్

ఆయుష్మాన్ ఖురానా కొత్త సినిమా ‘యాన్ యాక్షన్ హీరో’ లండన్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది..

An Action Hero : యాక్షన్ హీరోగా ఆయుష్మాన్

An Action Hero

Updated On : January 22, 2022 / 1:16 PM IST

An Action Hero: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటూ.. ఎంతో పోటీ వాతావరణం ఉండే బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా.. నటుడిగానే కాకుండా సింగర్‌గా, టీవీ హోస్ట్‌గానూ ప్రేక్షకులను అలరించాడు ఆయుష్మాన్.

Naga Shaurya : ‘కృష్ణ వ్రింద మిహారి’ గా నాగ శౌర్య..

ఇప్పుడు మరో వైవిధ్యభరితమైన సినిమా సైన్ చేసాడు. టీ సిరీస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, స్టార్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ‘యాన్ యాక్షన్ హీరో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. అనిరుధ్ అయ్యర్ డైరెక్ట్ చేస్తున్నారు. లండన్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు టీం.

Shyam Singha Roy : డిలీటెడ్ సీన్ చూశారా?..

ఆయుష్మాన్ కెరీర్‌లో ‘యాన్ యాక్షన్ హీరో’ ఓ డిఫరెంట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతుందని చెప్తున్నారు మేకర్స్. ‘పాతాల్ లోక్’ ఫేం జైదీప్ అహ్లావత్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. కౌశల్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. ఈ ఏడాదిలోనే విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు.