Mohan Babu : మోహన్ బాబు ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్..

మంచు ఫ్యామిలీలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

An unexpected twist in Mohan Babu episode

Mohan Babu : మంచు ఫ్యామిలీలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబు చిన్న కొడుకు, హీరో మంచు మనోజ్ తో మంచు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ల మధ్య పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. ఈ గొడవల నేపథ్యంలో మనోజ్‌ను ఉద్దేశించి మోహన్ బాబు ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. ఆ తరువాత మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చెయ్యడం, తరువాత ఆయన పై కేసు.. ఇలా మంచు కుటుంబంలో వివాదం చిలికి చ్చిలికి పెద్దదైంది.

అయితే తాజాగా మోహన్ బాబు కేసులో సరికొత్త ట్విస్ట్ నెలకొంది. తాజాగా మోహన్ బాబు నుంచి తాము ఎలాంటి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయలేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. మోహన్ బాబు మెడికేషన్‌లో ఉన్నట్లు తమకు సమాచారం ఇచ్చినట్టు పహడి షరీఫ్ పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా రెండు మూడు రోజుల తర్వాత తానే స్వయంగా విచారణకు వస్తానని పోలీసులకు మోహన్ బాబు తెలిపారట.

Also Read : సంధ్య థియేటర్ ఘటన.. సినీ పరిశ్రమ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటి?

మరోవైపు విచారణ సమయంలోనే తన గన్ ను కూడా పోలీసులకు అందిస్తానని పోలీసులకు మోహన్ బాబు హామీ ఇచ్చారట. కానీ మోహన్ బాబు ఎక్కడ ఉన్నాడో తమకు సమాచారం లేదని పహడి షరీఫ్ పోలీసులు క్లారిటీ ఇవ్వడం షాకింగ్ గా మారింది. మరి ముందు ముందు మోహన్ బాబు కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.